Cancer Patients: క్యాన్సర్ బాధితులకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి

Cancer Patients COVID-19 Positive: చిన్నారుల ఆసుపత్రిలో బాధితులపై ప్రయోగాలు చేయగా, క్యాన్సర్ బారిన పడిన కొందరిలో, క్యాన్సర్‌ను జయించిన వారిలో సైతం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని నెలలపాటు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 30, 2021, 01:32 PM IST
Cancer Patients: క్యాన్సర్ బాధితులకు COVID-19 సోకితే మరింత ప్రమాదకరం, ఈ విషయాలు తెలుసుకోండి

CoronaVirus Updates | ప్రపంచ దేశాలను వరుసగా రెండో ఏడాది చిన్నాభిన్నం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్. క్యాన్సర్ బాధితులకు కరోనా సోకితే కొన్ని నెలలపాటు సైతం మీ శరీరంలో SARS-CoV-2, కోవిడ్19 లక్షణాలు అలాగే ఉంటాయట. ఈ బయో మెడిసిన్ అనే జర్నల్‌లో ఈ విషయాలను ప్రచురించారు. ముఖ్యంగా చిన్నారులు, యువతలో ఈ సమస్య అధికంగా గుర్తించినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. 

లాస్‌ఏంజెల్స్‌లోని చిన్నారుల ఆసుపత్రిలో బాధితులపై ప్రయోగాలు చేయగా, క్యాన్సర్ బారిన పడిన కొందరిలో, క్యాన్సర్‌ను జయించిన వారిలో సైతం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని నెలలపాటు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. క్యాన్సర్ బారిన పడిన ఇద్దరు చిన్నారులు, ఓ యువకుడిపై నిర్వహించిన తమ ప్రయోగంలో కొన్ని నెలలపాటు వారిలో SARS-CoV-2, కోవిడ్19(Covid-19) లక్షణాలు అలాగే ఉన్నాయని గుర్తించారు. ఎముక క్యాన్సర్, బ్లడ్ రక్త క్యాన్సర్ బారిన పడిన వారిలో ఈ లక్షణాలు అధికంగా ఉంటున్నాయట. కనుక క్యాన్సర్ బాధితులు కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా కరోనా టీకాలు తీసుకోవడం, కోవిడ్19 నిబంధనలు పాటించడం వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Also Read: COVID-19 Cases: తెలంగాణలో నైట్ కర్ఫ్యూలోనూ తగ్గని కరోనా పాజిటివ్ కేసులు 

కరోనా వైరస్ బ్రిటన్‌లో మొదట బీ117 అనే రకాన్ని గుర్తించగా, తదనంతర కాలంలో అది భారీ మార్పులు చోటుచేసుకుని ప్రమాదకరంగా మారిందని ఆ హాస్పిటల్ క్లినికల్ మైక్రోబయాలజీ మరియు వైరాలజీ లాబోరేటరీ డైరెక్టర్, రచయిత జెన్నిఫర్ డియన్ బార్డ్ తెలిపారు. కరోనా బారిన క్యాన్సర్ బాధితులలో రోగనిరోధక వ్యవస్థ కొంత దెబ్బ తినడం ద్వారా కోవిడ్19 లక్షణాలు చాలాకాలం పాటు వారిలో కనిపిస్తాయని చెబుతున్నారు. 

క్యాన్సర్ పేషెంట్లపై కరోనా ప్రభావం..
ఇతర వ్యాధి సోకిన బాధితులతో పోల్చితే క్యాన్సర్ బారిన పడిన బాధితులలో కరోనా వైరస్(CoronaVirus) సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. క్యాన్సర్ కణాలపై పోరాటంలో భాగంగా వారిలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుందని, త్వరగా వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇతర వ్యాధులతో బాధపడే వారితో పోల్చితే, కరోనా సోకిన క్యాన్సర్ బాధితులలోనే మరణాలు అధికంగా సంభవించాయని ఈ ఏడాది జనవరిలో ఓ జర్నల్‌లో ప్రచురించారు.

Also Read; 7th Pay Commission: 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు Travel Allowanceపై లేటెస్ట్ అప్‌డేట్

అందుచేతనే క్యాన్సర్ బాధితులను సాధ్యమైనంత త్వరగా కరోనా టీకాలు తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తుంటారు. కరోనా టీకాలు తీసుకుంటే వారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది, కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులలో యాంటీ బాడీస్ త్వరగా ఉత్పత్తి అయి వైరస్‌పై పోరాటం చేస్తాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. కరోనా సోకిన క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్‌ను జయించిన వారు సైతం కోవిడ్19 వ్యాక్సిన్ తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. 

Also Read: Co-Win Registration: కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవాలో తెలుసా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News